మహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్
దుద్యాల్: మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పలువురు మహిళలు కొనియాడారు. ఇందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఆర్టీసీలో బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకులు, క్యాంటిన్లు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. దుద్యాల మండలానికి మంజూరైన పెట్రోల్ బంకు అనుమతి పత్రాలను సోమవారం కొడంగల్ సభలో మండల మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు. సంఘం అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి సత్యమ్మ, కోశాధికారి సునీత తదితరులు సీఎం చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్నారు.
అనుమతి పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి


