బీసీ జేఏసీ పరిగి చైర్మన్‌గా సదానందం
పరిగి: బీసీ జేఏసీ పరిగి నియోజకవర్గ చైర్మన్‌గా పరమటి సదానందంను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హన్మంతుముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ నూతన కమిటీని ఎంపిక చేసుకున్నారు. వైస్ చైర్మన్‌గా ఆనంద్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా చెరుకు సత్తయ్య, ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శులుగా వెంకట్‌రాములు, యాదయ్య, ముఖ్య సలహాదారులుగా వెంకటేష్, జగన్మోహన్, నర్సింహులు, బాలముకుందం, పాండురంగాచారి, సంయుక్త కార్యదర్శులుగా ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మణ్‌లను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.
రైలు కింద పడి
యువకుడి ఆత్మహత్య
అనంతగిరి: వికారాబాద్ మండలం గోధుమగూడ–ధారూరు రైల్వేస్టేషన్ సమీపంలో యాలాల మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణ(19) ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు నగరంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లోకో పైలట్ చూస్తుండగానే రైలు కింద పడి అతడు మృతి చెందినట్లు ఽరైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాగా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపారు.


