ఆత్మరక్షణకు కరాటే దోహదం
దోమ: ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్‌ఐ వసంత్ జాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో డీవైఎస్‌ఓ (డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్) ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణ పొందిన విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. మాస్టర్ బోయిని రాములు నెల రోజులుగా 121 మందికి కరాటేలో శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు ధృవపత్రాలు అందజేశామని మాస్టర్ తెలిపారు. చిన్నారుల్లో శారీరక, మానసిక సమతుల్యతకు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుద్ధ విద్య దోహపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య ముదిరాజ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


