తాగునీటికి తండ్లాట
కుల్కచర్ల: నీటి కటకటతో హీర్యనాయక్ తండా వాసులు ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరాలో అంతరాయం కలగడంతో గిరిజనులు సమీప పొలాల వద్దకు వెళ్లి, తెచ్చుకుంటున్నారు. మూ డు రోజులుగా ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు.
బోరులో కెమికల్ వాటర్
తాండూరు రూరల్: వ్యవసాయ పొలంలో బోరు వేయగా కెమికల్ నీళ్లు వచ్చిన సంఘటన మండలంలోని గుంతబాసుపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో మాజీ సర్పంచ్ జగదీష్ తన పొలంలో నూతనంగా బోరు మోటారు తవ్వించారు. 360 ఫీట్లు వేసిన తర్వాత బోరు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. తీరా నీటిని చూసిన వారు షాక్ అయ్యారు. మోటారు నుంచి కెమికల్ వాసన రావడంతో పాటు నీళ్లు డీజిల్ మాదిరిగా వచ్చాయి. గతంలో గ్రామ శివారులో విండోస్ కెమికల్ ఫ్యాక్టరీ కొనసాగేది. ఆ ఫ్యాక్టరీ నిర్వాహకులు వ్యర్థ జలాలను బోరు వేసి భూమిలోకి రివర్స్ పంపించారు. అప్పట్లో ఇలా చేయడం ద్వారానే ప్రస్తుతం గ్రామ శివారులోని పొలాల్లో బోరు నుంచి కెమికల్ నీళ్లు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వారం రోజుల క్రితం ఓ రైతు వ్యవసాయ పొలంలో బోరు వేయడంతో పాటు, గ్రామానికి వాటర్ ప్లాంట్ కోసం బోరు వేసిన సమయాల్లో సైతం ఇలా కెమికల్ నీళ్లు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు.
చిక్సిత పొందుతూ
మహిళ మృతి
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జా తీయ రహదారిపై మొయినాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెందింది. మొయినాబాద్ సమీపంలోని ఆన్ ది వే డ్రైవ్ ఇన్ హోటల్(పెంటయ్య హోటల్) వద్ద శుక్రవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో క్యాబ్ డైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందగా ఫొటో గ్రాఫర్ లోకేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో తలకు గాయమై తీవ్రంగా గాయపడిన హోండా కారు డ్రైవర్ తాండూరుకు చెందిన వెంకట్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అదే ప్రమాదంలో తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుజాత (50) పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గాయపడిన మరో ము గ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మేడపై నుంచి
జారి పడి వ్యక్తి దుర్మరణం
ఇబ్రహీంపట్నం రూరల్: తమ్ముడి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన ఓ అన్న మేడపై నుంచి జారి పడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన కుంచెల ముత్యాలు వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. దీనికి ఆయన సోదరుడు శ్రీశైలం(30) పెళ్లి పత్రికలు పంచడానికి శనివారం తుర్కయంజాల్‌లో వారి బంధువు విష్ణు ఇంటికి వెళ్లాడు. రాత్రి కావడంతో భోజనం చేసి ఇల్లు ఇరుకుగా ఉండడంతో మూడు అంతస్తుల మేడపై అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున 2 గంటల చూసే సరికి శ్రీశైలం పక్కన కనిపించలేదు. దీంతో చుట్టూ వెతకగా కింద కుక్కలు అరస్తుండటం గమనించడంతో దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ తీవ్ర గాయలతో శ్రీశైలం విగత జీవిగా పడి ఉన్నాడు. నిద్రమత్తులో రేయిలింగ్‌పై నుంచి పడి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం..మహిళ మృతి
వెంగళరావునగర్ : గ్యాస్ లీక్ కావడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ రహమత్‌నగర్ కమాన్‌గల్లీలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సతీష్‌సింగ్, సోనూబాయి(40) దంపతులు కమాన్‌గల్లీలో నివాసముంటున్నారు. ఆదివారం ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మధ్యాహ్నం సోనూబాయి వంట చేస్తోంది. ఒక్కసారిగా వంటింట్లో్‌ంచి కేకలు వినిపించాయి. సోనూబాయి తల్లిదండ్రులు వంటగదిలోకి వచ్చి కుమార్తెను రక్షించారు. ఈ ప్రయత్నంలో వారికి కూడా మంట లు అంటుకున్నాయి. హుటాహుటిన సమీ పంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించా రు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ గా మంటలు పెద్ద ఎత్తున గది నిండా వ్యాపించాయి. ఫిల్మ్‌నగర్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.


