ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
అనంతగిరి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని రామమందిరంలో ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నెల రోజులుగా సాగుతున్న రుద్రాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఓంకారం, సుప్రభాత సేవ, నగర సంకీర్థన, గోపూజతో ఉత్సవాలు ప్రారంభయ్యాయి. మహా గణపతి పూజ, మహన్యాస, లఘున్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం నిర్వహించి శివపార్వతులకు కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలన్నారు. సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, శోభాయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నవాబుపేట మాణిక్‌ప్రభు సంస్థాన్ పీఠాధిపతి బాలమార్తాండ మహరాజ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మంజుల, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, గీతావాహిణి అధ్యక్షురాలు శ్రీదేవి, సేవా మండలి ప్రతినిధులు రాజు, వెంకట్, సుభాష్ పంతులు, భోగేష్ పంతులు, యాస్కి రవీందర్, శ్రీనివాస్, విజయ్, వేణుగోపాల్, వినోద్, నరేందర్, విజయ్‌కుమార్, సుధీర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్


