● సదర్.. అదుర్స్
దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఆదివారం రాత్రి సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో దున్నపోతులతో ఊరేగింపు నిర్వహిచారు. ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రధాన వీధుల మీదుగా సాగింది. దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాదవులంత సంఘటితం కావాలని, కలిసి కట్టుగా ఉంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు పక్కీరప్ప, వెంకటయ్య, అనంతయ్య, వెంకటేశ్, రమేశ్, మాజీ సర్పంచ్ రాములు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


