కిశోర బాలికలకు పంజాబీ డ్రెస్సు! | - | Sakshi
Sakshi News home page

కిశోర బాలికలకు పంజాబీ డ్రెస్సు!

Nov 23 2025 9:31 AM | Updated on Nov 23 2025 9:31 AM

కిశోర బాలికలకు పంజాబీ డ్రెస్సు!

కిశోర బాలికలకు పంజాబీ డ్రెస్సు!

మహిళలు ముందుకు వస్తే దాల్‌మిల్‌ ఏర్పాటు

ఇందిరమ్మ చీరల పంపిణీలోఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు రూరల్‌: 15ఏళ్ల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న కిశోర బాలికలకు ప్రభుత్వం పంజాబీ డ్రెస్స్‌లు అందజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారిస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయ న తాండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల అభ్యున్నతిని విస్మరించిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలు ముందుకు వస్తే దాల్‌, జిన్నింగ్‌ మిల్లు,పెట్రోల్‌ బంక్‌, రైస్‌ మిల్లుల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి వడ్డీ లేకుండా రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు రుణాలు ఇప్పించి, ప్రభుత్వ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్‌కార్డులో పేరున్న ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందజేస్తామని.. మార్చి 31 వరకు చీరల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, ఎంపీడీఓ విశ్వప్రసాద్‌, డీఆర్‌డీఏ, డీపీఎం శేఖర్‌, ఏపీఎం బాలయ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి భానుప్రియ, కోశాధికారి నాగమ్మ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నాగప్ప, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చందు, ఆయా గ్రామాల డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

వారసులకు ఉద్యోగాలు కల్పించండి

వయస్సు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వీఆర్‌ఏలు కోరారు. శనివారం ఎమ్మెల్యే పెద్దేముల్‌ మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరవగా వీఆర్‌ఏ లు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ఇచ్చి న వారిలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, కార్శదర్శి జనార్ధన్‌, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, వీఆర్‌ఏలు ఇస్మాయిలప్ప, బాలప్ప, పురుషోత్తం, నర్సింలు, హన్మంతు, భీములు ఉన్నారు.

నాణ్యమైన చీరలతో ఆడపడుచులకు గౌరవం

యాలాల: నాణ్యమైన చీరలతో ఆడపడుచులకు గౌరవం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరలను నాణ్యమైనవి పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, తహసీల్దార్‌ వెంకటస్వామి, ఎంపీడీఓ నాగసాయి శ్రీనిజ, ఏపీఎం శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వీరేశం, నాయకులు భీమప్ప, అక్బర్‌బాబా, మధుసూదన్‌రెడ్డి, రఘురాంరెడ్డి, మహిపాల్‌, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

వారసులకు న్యాయం చేయండి

వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వీఆర్‌ఏల తరపున వారి వారసులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు కోట్ల శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే చొరవతో తాగునీటి పైప్‌లైన్‌ పనులు

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో తాగునీటి పైప్‌లైన్‌ పనులు పూర్తయ్యాయని సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోకట్‌ బ్రిడ్జి నుంచి గ్రామానికి వచ్చే పైపులు వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఈ విషయమై గ్రామ కాంగ్రెస్‌ నాయకులు ఈడ్గి రాజేశ్వర్‌, రాములు, నాగప్ప, సూరప్ప తదితరులు కలిసి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆయన వెంటనే కొత్త పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ఆయా పనులు పూర్తి కావడంతో సొసైటీ చైర్మన్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు భీమప్ప, జిల్లా నాయకులు ధారాసింగ్‌ తదితరులు కాగ్నా నది వద్ద తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement