హోటల్‌కు రూ.50 వేల జరిమానా
తుర్కయంజాల్: నిబంధనలు పాటించని హోటల్ నిర్వాహకులకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వనిత రూ.50వేల జరిమానా విధించారు. వివరాలు.. మున్సిపల్ కేంద్రంలోని తులిప్స్ గ్రాండ్ హోటల్‌లో శుభ్రత పాటించకపోవడంతో పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వచ్చా యి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్‌రెడ్డి శానిటరీ సిబ్బందిని పరిశీలించాలని సూచించారు. శనివారం దాడులు నిర్వహించిన శానిటరీ అధికారులు కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారపదరార్థలు పాడైనట్లు గుర్తించి డస్ట్‌బిన్‌లో వేయించామన్నారు. అనంతరం హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించి రశీదు ఇచ్చామని తెలిపారు.
కోడిపందేల స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి
మొయినాబాద్ రూరల్: ఓ ఫాంహౌస్‌లో కోడి పందేలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం రాత్రి మండల పరిధిలోని బాకారం సమీపంలో ఓ ఫాంహౌస్‌లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణం రాజు పాటు మరో 14 మందిని అరెస్ట్ చేశారు. నాలుగు కార్లు, 13 మొబైల్ ఫోన్స్, రూ.60,950 నగదు, 22 కోళ్లు, 18 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై మొయినాబాద్ పోలీసులను వివరణ కోరగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.


