భూ బాధితుల ఆందోళన
కుల్కచర్ల: మార్టిగేజ్ పేరిట భూములు కోల్పోయిన అంతారం రైతులు శనివారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రియల్ వ్యాపారులు ఫిబ్రవరిలో తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని నమ్మబలికి వారి భూములు మార్టిగేజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాము మోసపోయామని తెలుసుకున్న రైతులు రెవెన్యూ అధికారులు, పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉ్నారు. ఈ క్రమంలో డీజీపీని కలిసేందుకు వెళ్లగా ఆయన రైతులను కలవకపోవడంతో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అడిషనల్ డీజీపీ చౌహాన్ డిసెంబర్ మొదటివారంలో డీజీపీని కలవాలని సూచించడంతో ఆందోళన విరమించామని రైతులు తెలపారు. వీరి ఆందోళనకు పీఎన్‌పీఎస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ మద్దతు తెలిపారు.


