శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం
మహిళల రక్షణకుప్రత్యేక చర్యలు
అనంతగిరి: జిల్లా నూతన ఎస్పీగా స్నేహ మెహ్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వ చ్చారు. ఇక్కడ పని చేస్తున్న నారాయణరెడ్డి మహేశ్వరం డీసీపీగా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. నేర నియంత్రణ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్య లు తీసుకుంటామన్నారు. తద్వారా ప్రజలకు మరింత చేరు వ అవుతామని అన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య బాగా పెరుగుతోందని, వాటి నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా మని తెలిపారు. మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లా లో పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.


