
పారదర్శకత పాటించాలి
బంట్వారం: ఉపాధ్యాయుల సర్దుబాటులో పారదర్శకత పాటించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం అన్నారు. కోట్‌పల్లి మండలంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీఎస్‌యూటీఎఫ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తూ.. మరోవైపు విద్యార్థుల సంఖ్యను పెంచాల ని ఒత్తిడి తేవడం సరైంది కాదన్నారు. జిల్లాలోని కొంతమంది స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈఓలు కొన్ని పోస్టులను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రాంచంద్రయ్య, వెంకట్‌రెడ్డి, గోపాల్, నరేష్, యాదవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం