
విద్యార్థులే దేశ పునాదులు
తాండూరు రూరల్: నేటి మన విద్యార్థులే దేశ పునాదులు అని తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న మాడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ప్రశంసించారు. తదనంతరం పలు గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. వర్షాకాలం సందర్భంగా ఆయా గ్రామాల్లో మొక్కలు నాటాలని ఉపాధిహామి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెనూ తప్పనిసరి
బంట్వారం: హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కోట్‌పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం ఆయన ఎంపీడీఓ డానియల్‌తో కలిసి కోట్‌పల్లి కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంట గదితో పాటు కూరగాయలను పరిశీలించారు. సరుకుల నాణ్యతను చెక్ చేశారు. వంటకాలు రుచిగా ఉంటున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే చెప్పాలని కోరారు. ఎస్‌ఓ పల్లవిరెడ్డికి పలు సూచనలు ఇచ్చారు.
ఎంపీడీఓ విశ్వప్రసాద్