
క్షయపై అప్రమత్తత అవసరం
బంట్వారం: క్షయ వ్యాధిపై అప్రమత్తత అవసరమని కోట్‌పల్లి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ మేఘన అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోట్‌పల్లి మండలం మోత్కుపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు టీబీ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పలువురిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశామన్నారు. వ్యాధికి గురైనట్లు నిర్ధారిస్తే ఆరు నెలలపాటు ఉచితంగా మందులతోపాటు నెలకు రూ.వేయి అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ ఖయూం, ఎంఎల్‌హెచ్‌పీ దివ్య, ఏఎన్‌ఎం నర్సమ్మ, టీబీ యూనిట్ రాజేందర్, అశోక్, ఎల్టీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
టీబీని నిర్మూలిద్దాం
దౌల్తాబాద్: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పీహెచ్‌సీ వైద్యాధికారిణి అమూల్య సూచించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కుదురుమళ్లలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అమూల్య మాట్లాడుతూ.. క్షయ వ్యాధి ఉన్న వారికి జ్వరం, దగ్గు, నీరసం బరువు తగ్గడం లక్షణాలు ఉంటాయన్నారు. ఈ శిబిరంలో 210 మందికి పరీక్షలు చేయగా 12 మందిని అనుమానితులుగా గుర్తించారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ భీమ్‌శంకర్, మాధవి, రాహత్ ఏఎన్‌ఎం పుష్పలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మెడికల్ ఆఫీసర్ మేఘన
మోత్కుపల్లిలో అవగాహన సదస్సు