
సభ్యులంతా ఐకమత్యంతో ఉండాలి
కొడంగల్ రూరల్: సభ్యులంతా ఐకమత్యంతో ఉండి సంఘటితంగా అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని రాజ్‌పుత్ సంఘం జిల్లా అధ్యక్షురాలు అనితాబాయ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో రాజ్‌పుత్ మహిళా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహిళలు అభివృద్ధి సాధించేందుకు అనితాబాయ్ చర్చలు నిర్వహిస్తూ పలు తీర్మానాలు చేసుకున్నారు. అనంతరం రాజ్‌పుత్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సంఘం అధ్యక్షురాలుగా మోతీబాయి, ప్రధాన కార్యదర్శిగా జానకీబాయ్, సహాయ కార్యదర్శులుగా యశోదబాయ్, సక్కుబాయ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు శ్యామల, గోరీబాయ్, సురేఖబాయ్ తదితరులు పాల్గొన్నారు.