
కూరగాయల ధరలు ౖపైపెకి
కొడంగల్: కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పచ్చి మిర్చి కిలో రూ.80కి చేరింది, క్యాప్సికం కిలో రూ.80, బీర కాయలు రూ.80, చిక్కుడు, గోరు చిక్కుడు రూ.80, టమాటా రూ.40, బెండ రూ.40, ఆలుగడ్డ రూ.40కి చేరింది. ఏమి కొనాలన్నా కిలో రూ.80 పైనే అని మహిళలు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల దిగుబడి తగ్గింది. కష్టపడి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు కావడం లేదు. అంతేకాకుండా దళారులు, వ్యాపారులు సిండికెట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఆర్థిక భారం తప్పడం లేదు.
జిల్లా రెవెన్యూ
అధికారిగా మంగిలాల్
అనంతగిరి: జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం మంగిలాల్‌ను ప్రభుత్వం నియమించింది. వరంగల్‌లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. వారం రోజుల క్రితం వికారాబాద్ డీఆర్‌ఓగా నియమితులైన పి.చంద్రయ్యకు ప్రమోషన్ రావడంతో ఆయన స్థానంలో మంగిలాల్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. చంద్రయ్యను ప్రభుత్వం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా బదిలీ చేసింది.