
అంగన్‌వాడీ భవన నిర్మాణం ప్రారంభం
దౌల్తాబాద్: మండల కేంద్రంలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, వీరన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో రూ.వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. మండల కేంద్రంలో రెండు అంగన్‌వాడీ భవనాలకు రూ.40లక్షలు నిధులు మంజూరయ్యాయని వాటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దస్తప్ప, సహకార సంఘం డైరెక్టరు ఆశప్ప, ఏఈ నాగేందర్ పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
బంట్వారం: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఎస్‌ఐ విమల సూచించారు. గురువారం ఆమె బంట్వారం చౌరాస్తాలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్సు దిగి నడుచుకుంటే వెళ్లే సమయంలో జా గ్రత్తలు పాటించాలన్నారు. ఏమైనా ఇబ్బందు లు ఎదురైతే 100కి కాల్ చేయాలని బాలికలకు సూచించారు. అంతకుముందు ఆమె వాహనాలను తనిఖీ చేసి పత్రాలను పరిశీలించారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
అనంతగిరి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) నర్సింలు, రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం వికారాబాద్‌లోని విద్యుత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంస్థ చేపట్టే విద్యుత్ అఽభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులను విడుదల చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అవసరమయ్యే సామగ్రిని మంజూరు చేశామన్నారు. అధికారులు తమ తమ హెడ్‌క్వార్టర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ రవిప్రసాద్, డీఈలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి స్వాధీనం
అనంతగిరి: ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని కొత్రెపల్లి రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 164 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన సమాచారంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి అన్యాకాంత్రం అయిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరేష్ , సిబ్బంది తదితరులు ఉన్నారు.
కుటుంబ కలహాలతో ఉరేసుకున్న రైతు
పరిగి: కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పత్తి జంగయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం భూమి, ఇల్లు విషయంలో కుటుంబీకులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి చెందిన జంగయ్య పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పెంటమ్మ, కొడుకు నర్సింహులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అంగన్‌వాడీ భవన నిర్మాణం ప్రారంభం

అంగన్‌వాడీ భవన నిర్మాణం ప్రారంభం

అంగన్‌వాడీ భవన నిర్మాణం ప్రారంభం