బషీరాబాద్: ముస్లింలకు చెందిన ఖబరస్తాన్ స్థలంలో కబ్జాలను అడ్డుకోవాలని మైల్వార్‌కు చెందిన మైనార్టీలు గురువారం తహసీల్దార్ షాహెదాబేగంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 235 సర్వేనంబర్‌లోని 4.35 ఎకరాల భూమిలో 70 ఏళ్లుగా ఖబరస్తాన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ స్థలాన్ని కొంత మంది కబ్జా చేసి పశువుల కొట్టాలు వేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఇక్కడే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి నర్సిములుగౌడ్ దగ్గరుండి ఖబరస్తాన్ స్థలంలో ఇళ్లకు ముగ్గు పోయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి, కబ్జాలను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, మైనార్టీ నాయకులు ఇద్రీస్, ఇర్ఫాన్, ఖుతుబ్, అజీజ్, మహబూబ్ తదితరులు ఉన్నారు.
తహసీల్దార్‌కు ముస్లిం నేతల వినతి