
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
మోమిన్‌పేట: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తపస్ ముందంజలో ఉంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఆయా గ్రామాల పాఠశాలలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఉద్యమించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తీసుకురావాలన్నారు. ప్రస్తుతమున్న పెన్షన్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు ఎక్కువ మొత్తంలో సభ్యత్వం పొందాలని కోరారు. కార్యక్రమంలో తపస్ మండలశాఖ అధ్యక్షుడు మధుకర్, ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యాయులు మైపాల్‌రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
తాండూరు రూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనందం అన్నారు. పెద్దేముల్ మండలం కందనెల్లి ఉన్నత పాఠశాలలో గురువారం తపస్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సరెండర్ బిల్లులు, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తపస్ సంఘం ద్వారా ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం పెద్దేముల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, సంతోష్, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రావు, బస్వరాజ్, మహేష్, వెంకట్, సంతోష్, అనిల్ పాల్గొన్నారు.
తపస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి