
పకడ్బందీగా ఓటరు నమోదు
పూడూరు: గ్రామాలకు వెళ్లే అధికారులు ఓటరు నమోదు పక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్‌ఓ, బీఎల్‌ఓ సూపర్‌వైజర్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది సరి చేయాలన్నారు. తప్పులు, ఒప్పులు సరి చేయడంతో పాటు డబుల్ ఉన్న ఓట్లను తొలగించాలని చెప్పారు. ఓటరు జాబితాను తప్పులు లేకుండా తయారు చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను సేకరించాలన్నారు. జాబితా నుంచి ఓటరును ఎలా తొలగించాలనేది వివరంగా తెలిపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో బీఎల్‌ఓల పాత్ర కీలకం
దౌల్తాబాద్: క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ కీలకమని తహసీల్దారు గాయత్రి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బీఎల్‌ఓలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నికల బాధ్యత బీఎల్‌ఓలపై ఆధారపడి ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును కలిగి ఉండాలని ఆయా గ్రామాల బీఎల్‌ఓలు ఆ దిశగా వారిని చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీ చాంద్‌పాషా, హెచ్‌ఎం శ్రీహరిరెడ్డి, ట్రైనర్లు భీమప్ప, సాయిలుగౌడ్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర

పకడ్బందీగా ఓటరు నమోదు