
చదువు ఇష్టంలేక పారిపోయాడు
కుల్కచర్ల: ఇంటర్ చదవడం ఇష్టం లేక పారిపోయిన విద్యార్థి తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గండీడ్ మండలం రుసుంపల్లి గ్రామానికి చెందిన సందీప్ మండలంలోని బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా చదవడం ఇష్టంలేని సందీప్ మంగళవారం ఉదయం గురుకుల పాఠశాల గోడ దూకి పారిపోయాడు. కుల్కచర్ల నుంచి బస్సులో మహబూబ్‌నగర్ వరకు వెళ్లి, అటునుంచి రైలులో తిరుపతికి వెళ్లాడు. బుధవారం శ్రీవారిని దర్శించుకొని అదేరోజు రాత్రికి రేణిగుంటకు చేరుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో స్టేషన్‌లో ఉన్న ఒక వ్యక్తి ఫోన్‌తో తన అమ్మతో మాట్లాడాడు. ఫోన్‌పే ద్వారా రూ.500 డబ్బులు వేయాలని కోరాడు. వెంటనే ఆమె సదరు వ్యక్తితో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆయన బాలుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. గురువారం కుటుంబీకులు, కుల్కచర్ల పోలీసులు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు విద్యార్థిని కుల్కచర్లకు తీసుకువచ్చారు. విద్యార్థులు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలని ఎస్‌ఐ రమేష్ సూచించారు.
తిరుపతిలో ప్రత్యక్షమైన గురుకుల పాఠశాల విద్యార్థి