
జుంటివాగు పరిశీలన
బషీరాబాద్: మండలంలోని జుంటివాగును బుధవారం ఇరిగేషన్ డీఈ కృష్ణయ్య, యాలాల తహసీల్దార్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రెండు శాఖల అధికారులు పరిశీలించారు. ఈ నెల 8న కబ్జా చెరలో జుంటివాగు అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో అధికారుల బృందం జుంటివాగును పరిశీలించింది. వాగు పొడవున 200 మీటర్ల మేర 5 మీటర్ల లోపలికి కబ్జా చేసినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న పొలం యజమాని సంతోష్ కుమార్, వీణ దంపతులు చెక్‌డ్యామ్‌కు వింగ్ వాల్ కింద తాండూరు మండలం మాచనూరు రెవెన్యూ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 39జీ 2లో 20 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తెలిపారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినట్ల అధికారుల బృందం గుర్తించింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసి స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే వాగు రోజు రోజుకూ కబ్జాలకు గురై కుచించుక పోయిందని పలువురు రైతులు ఆరోపించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ భానుప్రకాశ్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జుంటివాగు పరిశీలన