
ఎరువులు అందుబాటులో ఉంచండి
● జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి ● ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు
దుద్యాల్: మండలంలో సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. బుధవారం దుద్యాల్, పోలేపల్లి గ్రామాల్లోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. హకీంపేట్ రైతు వేదికలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పంటల సాగుపై సందేహాలు ఉంటే ఏఈవోను సంప్రదించాలని అన్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడరాదని సూచించారు. మోతాదుకు మించి వాడితే పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత సీజన్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఏఈవో భావన ఉన్నారు.