
ఎంపీ సేవలు అభినందనీయం
కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకమైన వాహనాన్ని ఏర్పాటుచేసి శుభ్రం చేయిస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమని వైజీఆర్ స్వచ్ఛంద సంస్థ మండల కో ఆర్డినేటర్ రాంచంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం కుల్కచర్ల మండలం ఘణపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీరోజు పార్లమెంటరీ నియోజకవర్గంలోని 36 పాఠశాలలను శుభ్రం చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటుచేసిన వాహనం ద్వారా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.