
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
కొడంగల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, ఆర్గనైజర్ రాజేశ్వరీ అన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల్లో భాగంగా బుధవారం పట్ణణంలో వెటర్నరీ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. సంఘాల్లో లేని మహిళలను గుర్తించి వారిని కొత్త సంఘాల్లో చేర్పించాలన్నారు. ఆగిపోయిన సంఘాలను గుర్తించి వాటిని పునరుద్ధరించాలన్నారు. మహిళా వృద్ధాప్య సంఘాలను, కిషోర బాలికలసంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం వల్ల వారు ఆర్థికాభివృద్ధి సాధంచే అవకాశం ఉంటుందన్నారు. జీవిత బీమా, ప్రమాద బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా క్యాంటిన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మహిళలను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో కొడంగల్ మున్సిపల్ మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
పూడూరు: మహిళా సమాఖ్య సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నర్సింలు అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా మండలంలోని మేడిపల్లికలాన్, పరిగి మండలం రూఫ్‌ఖాన్‌పేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలపై కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. అనంతరం ప్రాజె క్టు మేనేజర్ మాట్లాడుతూ.. మహిళలు సంఘటితంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెట్రోల్ బంక్ లు, ప్రై వేటు బస్సుల కొనుగోలు, క్యాంటిన్ల వంటివి ఏర్పా టు చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎంలు బందయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సీసీలు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
సీ్త్రనిధి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ