
తెలంగాణకే ఆదర్శం ఎన్కేపల్లి
బొంరాస్‌పేట: ఎన్కేపల్లి యావత్ తెలంగాణకే ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యాప్రగతి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. శ్రీబలభీమ న్యూస్ ఛానెల్, మాస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు, మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, సీఐ శ్రీధర్‌రెడ్డి, వెంకట్రాములుగౌడ్, నర్సింలుగౌడ్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్ మాట్లాడారు. గ్రామం నుంచి ప్రైవేట్ బడులకు వెళ్లేవారు ఇక్కడ చేరడం, గురుకులాలకు ఎక్కువ మొత్తంలో ప్రవేశాలు సాధించడం, మహిళా సంఘాల చొరవ, ప్రభుత్వ బడులను కాపాడుకొంటూ విద్యాప్రగతి సాధించడంలో మండలంలోనే ప్రథమ స్థాయిలో నిలిచిందని వారు ప్రశంసించారు. విద్యార్థులకు కుటుంబ సభ్యులు సైతం జ్ఞానం అందివ్వాలని, విద్యా పర్యవేక్షణ చేయాలని ప్రధాన వక్త భాస్కరయోగి పేర్కొన్నారు.
పలకల పంపిణీ
పాఠశాలలోని నూతన 120మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచితంగా పలకలు, ఐడీ కార్డులు, టై, బెల్టు, బూట్లు, బ్యాగులు, పాఠశాలకు సీసీకెమెరాలు, ఫరేడ్ డ్రమ్స్ అందజేశారు.
మొక్కలు నాటిన అధికారులు
కొడంగల్ ఫారెస్టు రేంజ్ అధికారి సవిత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవం నిర్వహించారు. అడవులను కాపాడాలని గ్రామస్తులకు సూచించారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులు రహీం, అలీమ్, హెచ్‌ఎం జ్యోతిపరమేశ్వరి దంపతులకు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో టీవీవీ జిల్లా కార్యదర్శి రవీందర్‌గౌడ్, ఎంఈఓలు హరిలాల్, రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి