
పరిహారం ఇప్పించండి సారూ
తాండూరు రూరల్: జాతీయ రహదారి నిర్మాణంతో రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు కోల్పోతున్నామని, బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని గ్రామస్తులు కోరారు. బుధవారం తాండూరు మండలం కోటబాసుపల్లి గ్రామస్తులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..తాండూరు–చించోళి ప్రధాన రోడ్డు మార్గంలో ఎన్‌హెచ్ 167 జాతీయ రహదారిని నిర్మిస్తున్నారన్నారు. ఈ నిర్మాణంలో కోటబాసుపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న 27ఇళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రోడ్డువెడల్పులో ఇళ్లుపోతే ఎక్కడ నివసించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇస్తే మరోచోట ఇళ్లు నిర్మించుకుంటామన్నారు. కావున ప్రభుత్వం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలని సబ్ కలెక్టర్‌ను వారు కోరారు. ఈ విషయంలో కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప, మాజీ సర్పంచు కుర్వ నాగార్జున, గ్రామస్తులు రఘునాథ్‌రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
సబ్‌కలెక్టర్‌ను కోరిన
కోటబాసుపల్లి గ్రామస్తులు
జాతీయ రహదారి నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్నామని ఆవేదన