
సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
తాండూరు రూరల్: గ్రామాల్లో మహిళ సంఘాలను బలోపేతం చేయాలని అదనపు డీఆర్‌డీఏ నర్సింలు అన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో మహిళ సంఘాల సభ్యులతో మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. సంఘంలో లేని మహిళలను నూతన సంఘంలో చేర్పించి అవగాహన కల్పించాలన్నారు. సంఘం సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని వివరించాలన్నారు. మహిళలకు వడ్డిలేని రుణాలు, పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, స్కూల్ యూనిఫాంలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ భీమయ్య, ఏపీఏం ఆనంద్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి భానుప్రియ, కోశాధికారి నాగమణి, సీసీలు, వీఓఏలు, ఆయా గ్రామాల మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఆర్థికంగా ఎదగాలి
దోమ: మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా ప్రాజెక్ట్ అధికారి(డీపీఎం) నర్సింలు, కమలాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికల ఇందిరా క్రాంతి మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సదర్భంగా మహిళా సంఘాల సభ్యులకు, వీఓఏలకు, సీసీలకు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడే అంశాలను ఎంపీడీఓ గ్యామతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన సంఘాలను ఏర్పాటుకు వీఓఏలు, సీసీలు చర్యలు తీసుకోవాలన్నారు. 15–18 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలను కిషోర బాలికల సంఘాలుగా, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను దివ్యాంగుల సంఘాలుగా బలోపేతం చేయాలన్నారు. ప్రతీ సంఘానికి లోన్లు ఇప్పించి రెగ్యులర్‌గా కట్టించేలా శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు నారాయణ, జంగయ్య, నర్సింలు, లక్ష్మారెడ్డి, శ్రీశైలం, అనసూయ, సుజ్ఞాని, అంజమ్మ, అకౌంటెంట్ మంజుల పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీఏ నర్సింలు