
అవగాహన కల్పించండి
బంట్వారం: వయోజనులంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం కోట్‌పల్లి మండలం రాంపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో బీఎల్‌ఓలకు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలన్నారు. మార్పులు, చేర్పులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పాత ఫొటోలు తొలగించి కొత్త ఫోటోలు అప్‌లోడ్ చేయాలన్నారు. పేరులో తప్పులుంటే సవరించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదు అయ్యేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం ఫారం–7 ద్వారా తొలగించాలన్నారు. మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ డానియల్, ఎంఈఓ చంద్రప్ప, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సుధీర్