
రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి
బడంగ్‌పేట్: బాలాపూర్ మండలంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. బాలాపూర్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలు ఏళ్ల తరబడి తిష్టవేశారని అన్నారు. తనపై రెక్కీ సైతం నిర్వహించారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.