
జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్‌హెచ్‌పీఎస్ కృషి
జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్
బొంరాస్‌పేట: మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్‌హెచ్‌పీఎస్ కృషి చేసిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు. భారత్ ముక్తి మోర్చా, ఎల్‌హెచ్‌పీఎస్ తరఫున పోరాడామన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సంఘం ముందుంటుందన్నారు.
పీఆర్టీయూ సభ్యత్వ
కార్డుల పంపిణీ
యాలాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ ముందుంటుందని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములుతో కలిసి 2025–26గాను సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేశ్‌కుమార్, మొగులయ్య, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నష్టపోయా
న్యాయం చేయండి
దోమ: నకిలీ విత్తనాలతో నష్టపోయిన తనకు న్యాయం చేయాలని దొంగఎన్కేపల్లికి చెందిన రైతు పోట్టిగారి సాయిరెడ్డి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 2024 డిసెంబర్ 06న పరిగి పట్టణంలోని శ్రీమహేశ్వరీ ఫెర్టిలైజర్ దుకాణంలో రూ.1,300 వెచ్చించి హైబ్రిడ్ వరి విత్తనాలు (25 కేజీల బస్తా) తీసుకెళ్లి పొలంలో నాటేశామన్నారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యజమాని చెప్పినప్పటికీ కేవలం ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపారు. ఈ విషయమై పరిగి ఏడీఏకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తనకు న్యాయం చేయాలని కోరారు.
పోతులవాగు
కబ్జాను అడ్డుకోండి
ధారూరు: మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ సమీపంలోని పోతులవాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్దేముల్ మండలం మారేపల్లి రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ధారూరు తహసీల్దార్, ఇరిగేషన్ డీఈ రవికుమార్, కోట్‌పల్లి ప్రాజెక్టు కుడి కాల్వ ఏఈ మాధురీలతకు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు విన్నవించగా పోలీసులకు ఫిర్యాదు చేసి, చేతులు దులుపుకొన్నారని తెలిపారు. వాగు కాల్వకు గ్రానైట్‌తో సోలింగ్ చేసి, కాల్వను చిన్నదిగా చేశారని, దీంతో కింది భాగంలోని తమ పొలాలు నీట మునిగే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కాల్వకు రాళ్లు పేర్చడం ద్వారా పశువులు వెళ్లకుండా చేసి, మూగజీవాల దాహార్తి తీర్చుకునే అవకా శం లేకుండా చేశారని మండిపడ్డారు. వాగును కబ్జా చేసిన వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్లాట్ కబ్జా చేసిన వారిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: బోగస్ డాక్యుమెంట్లతో తన ప్లాట్‌ను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు చాడ రమేష్‌చందర్‌రెడ్డి మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడ వినాయకహిల్స్ సర్వేనంబర్ 94 నుంచి 97తో పాటు 103లో తనకు 300 గజాల ప్లాట్ ఉందని, ఈ ప్లాట్‌ను ఇద్దరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలతో తాను మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు.సంబంధిత ఎస్‌ఐ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోగా, సివిల్ తగాదా అంటూ కేసును మూసివేశారని ఆరోపించారు.

జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్‌హెచ్‌పీఎస్ కృషి