
ఆకలి కేకలపై విచారణ
బషీరాబాద్: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం ఆపితే ఏజెన్సీలను రద్దు చేస్తామని బషీరాబాద్ ఎంఈఓ రాములు హెచ్చరించారు. ‘ఆకలి కేకలుశ్రీ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి డీఈఓ రేణుకాదేవి స్పందించారు. మైల్వార్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పస్తులపై విచారణ జరిపి, మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని ఎంఈఓ రాములును ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఎంఈఓ ప్రధానోపాధ్యాయుడు వెంకటప్ప, ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరి, ప్రమీల, సంగీత తదితరులతో సమావేశమయ్యారు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతోనే వంట బంద్ చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై వివరణ తీసుకోవడంతో పాటు మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని ఏజెన్సీ వారు రాసి ఇచ్చారని స్పష్టంచేశారు. మంగళవారం మధ్యాహ్నం 150 మంది పిల్లలకు భోజనం పెట్టించారు.
మధ్యాహ్న భోజనం పునరుద్ధరణ

ఆకలి కేకలపై విచారణ