
లారీ బైక్ ఢీ.. వ్యక్తి మృతి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి సమీపంలో లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైకిస్టు మృతి చెందిన సంఘటన మంగళవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లికి చెందిన వై. యాదయ్య(29) వికారాబాద్ పట్టణంలోని మొబైల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. 10. 30గంటల ప్రాంతంలో ఎన్నెపల్లి చౌరస్తా దాటాక ఓ లారీ డ్రైవర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుకల గమనించకుండా అటుగా వస్తున్న యాదయ్య బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యాదయ్యకు తీవ్రగాయాలవ్వడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలిస్తుండగా తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుని అన్న నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు.