
ప్రమాదంలో ప్రజారోగ్యం
దుద్యాల్: మండలంలోని పలు పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. అసలే వర్షాకాలం.. అడపాదడపా కురుస్తున్న వానలతో గుంతల్లో నీరు నిలుస్తోంది. రోడ్లపై పారుతున్న మురుగుతో జనం అవస్థలు పడుతున్నారు. వీధుల్లో పరిశుభ్రత కరువైంది. దోమలు వ్యాప్తి చెంది జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంచాయతీ బోర్లు, కుళాయిల వద్ద మురుగు నీటి నిల్వతో తాగునీరు కలుషితమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు నిత్యం పలు వార్డుల్లో పర్యటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మండలంలోని దుద్యాల, హస్నాబాద్, కుదురుమల్ల, హకీంపేట, లగచర్ల, చిలుముల మైల్వార్, గౌరారం, ఈర్లపల్లి, పోలేపల్లి వంటి పెద్ద గ్రామాల్లో విషజ్వరాలు సోకకుండా పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని కోరుతున్నారు. లేదంటే డెంగీ, డయేరియా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
వీధుల్లో పారుతున్న మురుగు
కలుషితమవుతున్న తాగునీరు
పట్టించుకోని అధికారులు

ప్రమాదంలో ప్రజారోగ్యం