
ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి
కుల్కచర్ల: ఎన్నికల నిర్వహణపై సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ఎన్నికలపై అధికారులు, బూత్‌లెవల్ అధికారులు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాహిదాఖాతుం, ఇన్‌చార్జి ఎంపీఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ వాసుచంద్ర