
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
తాండూరు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్, ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ ప్రెసిడెంట్ నర్సిములు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి ఇబ్బంది పెడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీఓలు తెచ్చి కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని సవరిస్తూ, 10 గంటలకు పెంచుతూ జీఓ జారీ చేయడాన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, రాములు, నరేశ్, ప్రకాశ్, అశోక్, రమేశ్ తదితరులు కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.
పిలుపునిచ్చిన సీఐటీయూ, ఏఐటీయూసీ
మున్సిపల్ కమిషనర్‌కు
సమ్మె నోటీస్ అందజేత