
తప్పుల్లేకుండా ఓటరు జాబితా
యాలాల: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామ ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలన్నారు. ఇందుకుగాను ఏదైనా సలహాలు, సూచనలు అవసరమైతే వెంటనే మండల స్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటస్వామి, డీటీ కిరణ్‌కుమార్, ఆర్‌ఐలు వేణు, శివచరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్