
మంత్రికి శుభాకాంక్షలు
పరిగి: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఇటీవల కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మగారములు, గనుల శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్‌ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సన్మానించారు. సోమవారం సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేడు స్పీకర్ పర్యటన
మర్పల్లి: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం మర్పల్లికి విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.
రేపు జాబ్ మేళా
అనంతగిరి: టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ (డి–మార్ట్ కోసం)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10.30గంటలకు వికారాబాద్‌లోని ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌మేళాకు హాజరవ్వాలన్నారు. వివరాలకు 96760 47444 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
హౌసింగ్ డీఈఈ బదిలీ
తాండూరు రూరల్: తాండూరు డివిజన్ హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్‌ను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు బదిలీ చేస్తూ సోమ వారం హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది నెలల క్రితం తాండూరుకు వచ్చిన ఆయన నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో తనదైన ముద్రవేశారు. ఆయన సేవలపై కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖలీమొద్దీన్ స్థానంలో కొడంగల్ డీఈ ఎం.చందర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పరిగి తహసీల్దార్‌గా
వెంకటేశ్వరి
పరిగి: పరిగి తహసీల్దార్‌గా వెంకటేశ్వరిని నియమిస్తూ సోమవారం రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆనంద్‌రావు అక్రమంగా భూ రిజిస్ట్రేషన్ చేశారని ప్రజా సంఘాల నాయకులు నిరసనలు తెలపడంతో ఉన్నతాధికారు లు ఆయన్ను ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం డి–సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరిని పరిగి తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
13న కేఏఎన్‌పీఎస్
రాష్ట్ర మహాసభలు
జిల్లా కన్వీనర్ వెంకటయ్య
తాండూరు టౌన్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ వెంకటయ్య పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం తాండూరులో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ‘వైరుధ్యాల జీవనం, నయా ఉదారవాద భారత దేశంలో ప్రజలస్వామ్యం, అభివృద్ధి, సామాజిక న్యాయం’అనే అంశంపై రిటైర్డ్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు ప్రసంగిస్తారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలను రూపుమాపేందుకు కేఏఎన్‌పీఎస్ పోరాడుతుందన్నారు. వర్గీకరణలో ఎస్సీ ఉపకులాల వైపు నిలబడడంతో పాటు, రాజ్యాంగ విరుద్ధ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఈ పోరాటానికి మద్ధతు ఇస్తూ ఐక్యతను చాటేందుకు మహాసభలకు ప్రతీ ఒక్కరు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమితి జిల్లా కో కన్వీనర్ కిష్టప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.నరేశ్, ఎం.వెంకటయ్య, ఎం.శ్రీను పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

మంత్రికి శుభాకాంక్షలు

మంత్రికి శుభాకాంక్షలు