
ఫిర్యాదులను పరిష్కరించాలి
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సో మవారం వికారాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయ న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయని.. వాటిని పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.