
అరకొర సరఫరా
కొడంగల్: మున్సిపల్ పరిధిలో 16వేలకు పైగా జనాభా ఉంది. పట్టణ శివారులోని సిద్దనొంపు వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రిట్‌మెంట్ ప్లాంట్ నుంచి నీటి సరఫరా జరుగుతోంది. సీఎం నియోజకవర్గం కావడంతో అధికారులు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా అక్కడక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిబంధనల ప్రకారం నీటి సరఫరా జరగడం లేదనే అపవాదు ఉంది. మంచినీటి సరఫరా అరకొరగానే సరఫరా అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. పాత కొడంగల్‌లో కొన్ని రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్తులు తెలిపారు. కొడంగల్‌తో పాటు విలీన గ్రామాల్లో అవసరం మేరకు నీటి సరఫరా కావడం లేదని తెలుస్తోంది. గతంలో కూళాయిల ద్వారా రెండు గంటల పాటు నీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం గంటకు కుదించినట్లు స్థానికులు తెలిపారు.