
పెద్దపీట
సంక్షేమానికి
● స్పీకర్ ప్రసాద్‌కుమార్
● లబ్ధిదారులకుసీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేత
అనంతగిరి: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకులు శివయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరిని అభివృద్ధి చేస్తా
అనంతగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో అనంతగిరి గుట్టపై పర్యాటకులకు రూ.6 కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి సమీపంలో అనంతగిరులు ఉండటంతో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, మాజీ కౌన్సిలర్ మురళి, సీనియర్ నాయకులు రంగరాజు, బాదం అశోక్ తదితరులు పాల్గొన్నారు.