గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్‌కుమార్‌ | Sakshi
Sakshi News home page

గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్‌కుమార్‌

Published Thu, Apr 18 2024 10:35 AM

-

షాద్‌నగర్‌: బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా షాద్‌నగర్‌కు చెందిన జటావత్‌ వినోద్‌కుమార్‌ను బుధవారం పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చైతన్య పరుస్తానని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అఖండ మెజార్టీ అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళాతానన్నారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం జిల్లాస్థాయి పదవి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌ నాయక్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహ్మారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement