ప్రజాతీర్పును గౌరవిస్తాం | Sakshi
Sakshi News home page

ప్రజాతీర్పును గౌరవిస్తాం

Published Tue, Dec 5 2023 5:28 AM

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ - Sakshi

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌

అనంతగిరి: అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఓడిపోయినప్పటికీ ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో అధికార పార్టీకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. తనకు 5 సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన వికారాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని.. తాను అందరికీ అండగా ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో నా తరఫున ప్రచారం చేసిన ఎంపీ రంజిత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని..ఓటమికి గల కారణా లను సమీక్షించుకుంటామన్నారు. తన ఓటమి విషయంలో ఎలాంటి సాకులు చెప్పనని.. ఎవరినీ నిందించే ఆలోచన తనకు లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, దేవదాసు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement