ధారూరులో హస్తం హవా | Sakshi
Sakshi News home page

ధారూరులో హస్తం హవా

Published Tue, Dec 5 2023 5:28 AM

-

బీఆర్‌ఎస్‌కు గండి

ధారూరు: ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. ధారూరు మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. మండలం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,105 ఓట్లు కాంగ్రెస్‌కు లీడ్‌ రాగా, ఈసారి మాత్రం 2,774 లీడ్‌ సాధించి బీఆర్‌ఎస్‌ను గండి కొట్టింది. కారు పార్టీ బడా నాయకులు ఉన్న గ్రామాల్లోనే కాంగ్రెస్‌ పార్టీకి లీడ్‌ రావటం చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ గ్రామమైన కేరెళ్లితో పాటు బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులున్న ధారూరు, తరిగోపుల, దోర్నాల్‌, నాగసమందర్‌, నాగారం, మోమిన్‌కలాన్‌ బూత్‌లో కాంగ్రెస్‌ కన్నా బీఆర్‌ఎస్‌ వెనకంజలో నిలిచింది. మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో హస్తానికి లీడ్‌ రాగా కేవలం 8 గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు లీడ్‌ రావడంపై ఆ పార్టీ నాయకులు కంగుతిన్నారు.

కాంగ్రెస్‌కు ఆధిక్యం ఇచ్చిన

గ్రామాలు

కేరెళ్లిలో 94 ఓట్లు, నాగసమందర్‌లో 699, ధారూరులో 405, గట్టెపల్లి 29, కుక్కిందలో 232, అల్లాపూర్‌లో 55, ధర్మాపూర్‌, నర్సాపూర్‌లలో 52 చొప్పున, కొండాపూర్‌కలాన్‌లో 70, మున్నూరుసోమారంలో 186, రాంపూర్‌తండాలో 232, స్టేషన్‌ధారూరులో 154, చింతకుంటలో 121, హరిదాస్‌పల్లిలో 80, నాగారంలో 69, తరిగోపులలో 56, అంతారంలో 167, దోర్నాల్‌లో 13, గురుదోట్లలో 64, పీసీఎంతండాలో 163, అంపల్లిలో 19, మోమిన్‌కలాన్‌లో 37, మోమిన్‌ఖుర్దులో 8 ఓట్లు కాంగ్రెస్‌కు అధికంగా వచ్చాయి.

బీఆర్‌ఎస్‌కు..

రాజాపూర్‌లో 6 ఓట్లు, నాగ్‌సాన్‌పల్లిలో 51, మైలారంలో 175, అల్లిపూర్‌లో 72, ఎబ్బనూర్‌లో 41, రుద్రారంలో 33, గడ్డమీది గంగారంలో 44, అవుసుపల్లి బూత్‌లో 7 ఓట్లు బీఆర్‌ఎస్‌ లీడ్‌లో నిలిచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement