కుశల ప్రశ్నలు | Sakshi
Sakshi News home page

కుశల ప్రశ్నలు

Published Sat, Nov 11 2023 4:20 AM

- - Sakshi

ఆత్మీయ పలకరింపులు

దౌల్తాబాద్‌: అధికారంలో ఉన్నప్పుడు, సామాన్యుడికి ఏదైనా సమస్య వచ్చి, అయ్యా ఆదుకోండని దగ్గరికి వెళితే నేడు, రేపు అంటూ ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేయించుకునే నాయకులు ఎన్నికల వేళ.. ఓటరు దేవుడి దర్శనం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయ్యా, అవ్వా, అక్కా, చెల్లీ, అన్నా, తమ్ముడూ అంటూ సామాన్యుడి చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీమళ్లీ తారసపడుతున్నారు. కుశల ప్రశ్నలు వేస్తూ నన్ను మర్చిపోకండి అంటూ రెండు చేతులు ఎత్తి దణ్ణం పెడ్డుతున్నారు.

పదవి మీద ఉన్న ప్రేమ..

మామూలు సమయంలో ఎవరూ వచ్చినా, ఏమి అడిగినా స్పందించని నేతలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు వీలైనంత తొందరగా అక్కడ వాలిపోతున్నారు. బాధితులను పరామర్శించి, తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ.. మా పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వటం గమనార్హం. ఇలా ఎప్పటికప్పుడు నియోజకవర్గాన్ని చుట్టుముడుతూ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేయడంతో సామాన్యులు ఆశ్చర్య పోతున్నారు. ఎన్నికలు అనగానే రాజకీయ నాయకులు అందరూ ఇలా పల్లెలో వాలిపోతున్నారని, మిగతా సమయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా రాని వారు.. ఓటు కోసం ఇలా తిరగడం ఎంత స్వార్థం అని వాపోతున్నారు. పదవి మీద ఉన్న ప్రేమ.. సగటు జీవిపై చూపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

ఓటర్లకు నేతల సకల మర్యాదలు నన్ను మర్చిపోకు అన్నా అంటూ దండాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement