చేతులెత్తండి నుంచి ఈవీఎం | Sakshi
Sakshi News home page

చేతులెత్తండి నుంచి ఈవీఎం

Published Sat, Nov 11 2023 4:20 AM

- - Sakshi

షాద్‌నగర్‌: ఒకప్పుడు చేతులెత్తి అభ్యర్థిని ఎన్నుకునే స్థాయి నుంచి నేడు ఈవీఎంల సహాయంతో ఓటుహక్కును వినియోగించుకునే స్థాయికి మనదేశం ఎదిగింది. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల కాలం నుంచి పౌరులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మొదటిసారి 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో దేశంలోని పౌరులందరికీ ఓటుహక్కు ఉండేది కాదు. ఉద్యోగులు, అక్షరాస్యులతో పాటు భూస్వాములకు మాత్రమే ఓటుహక్కు కల్పించారు. నాడు మండలాలను ఫిర్కాలుగా పిలిచేవారు. గ్రామస్థాయిలో విలేజ్‌ మేజిస్ట్రేట్‌(వీఎం)లు ఉండేవారు. వీరి వద్దనే ఓటర్లుగా నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే వారు. ఓటు వేసే విధానంలో కూడా తేడా ఉండేది.ప్రత్యక్ష పద్ధతిలో బహిరంగ సభను నిర్వహించి మెజార్టీకోసంచేతులెత్తి ఓటును వినియోగించుకునేవిధానం అమల్లోఉండేది.

ఒక్కో అభ్యర్థికి ఒక్కో బాక్స్‌..

1952, 1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి ఒక బాక్స్‌ను ఏర్పాటు చేసేవారు. ఓటర్లు వారికి నచ్చిన వ్యక్తికి సంబంధించిన బాక్స్‌లో ఓటు వేసేవారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల నుంచి పోటీలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నా ఒకే బాక్స్‌ను కేటాయించి అందులోనే ఓటు వేసే విధానాన్ని తీసుకొచ్చారు. 1962 నుంచి ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో అభ్యర్థులందరికీ ఒకే బాక్స్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో 70 శాతానికి మించి పోలింగ్‌ నమోదైతే రిగ్గింగ్‌ జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చేవారు. తర్వాత క్రమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రహస్య పోలింగ్‌ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. బ్యాలెట్‌ పత్రాలతో ఓటువేసే విధానం నుంచి ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలను ఉపయోగించే స్థాయికి సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ భారత రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది.

ఓటుహక్కు వినియోగంలో

సమూల మార్పులు

సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న

ఎన్నికల కమిషన్‌

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement