రాజేంద్రనగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఖాజాపాషా తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం సంవత్సరం క్రితం కిస్మత్‌పూర్ సాయిబాబా కాలనీకి వలస వచ్చింది. వీరికి 17 సంవత్సరాల కూతురు ఉంది. కర్ణాటకలో ఉన్న సమయంలో స్థానికంగా ఉన్న ఓ యువకుడితో బాలిక చనువుగా ఉండేది. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి లభించకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని బాలికతో చనువుగా ఉండే యువకుడు సైతం కనిపించడం లేదని అతడిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు
షాబాద్: మినరల్ వాటర్ ముసుగులో కొందరు అ క్రమార్కులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని చెబు తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్నారు. షాబాద్ మండలంలో సుమారు 35 వాటర్ ప్లాంట్లు ఉన్నా అందులో ఒక్క దానికి కూడా అను మతి లేకపోవడం గమనార్హం. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని, రంగు రంగుల బోర్డులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కనీసం నీటిని శుద్ధి చేస్తున్నారా లేదానే విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి సరఫరా చేసే బాటిళ్లలో చెత్త చెదారం దర్శనమిస్తున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. పట్టణాలకే పరిమితమైన మినరల్ వాటర్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకింది. మండలంలో నీటి బాటిళ్లు, ప్యాకెట్లు తయారు చేస్తూ వేరే చి రునామాతో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌కు రూ. 20పైసలు ఖర్చు అవుతున్నా వాటి ని రూ.2లకు అమ్ముతున్నారు. 20లీటర్ల బాటిల్‌ను రూ.10 నుంచి, రూ.15లకు అమ్ముతున్నారు. ట్యా ంకర్ల ద్వారా బిందెకు రూ.5 వసూలు చేస్తున్నారు.
పట్టించుకోని సంబంధిత అధికారులు
అనుమతిలేని ప్లాంట్లు అనేకం ఉన్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముంది. లైసెన్స్‌లు లేని వాటర్ ప్లాంట్లలను సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
● లైసెన్సులు లేకుండానే35 మినరల్ వాటర్ ప్లాంట్లు
● పట్టించుకోని సంబంధిత అధికారులు