మా స్థలాన్ని ఆక్రమించి.. దౌర్జన్యం చేస్తున్నారు!
చంద్రగిరి మండలంలోని మామిడిమానుగడ్డ గ్రామంలో నాకు 56 సెంట్లు భూమి ఉంది. అందులో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. అయితే స్థానికంగా ఉంటున్న చెంగల్‌రాయల నాయుడు, కుమార్‌చౌదరి, రాజేంద్రనాయుడు, వెంకటసుబ్బానాయుడు, జానకిరామనాయుడు, సుబ్బరామనాయుడు మా భూమి ఆక్రమించి, మాపై దౌర్జన్యం చేస్తున్నారు. స్థానిక అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ న్యాయం చేయాలి.
– చల్లా రవి, చంద్రగిరి మండలం
ఇంటి స్థలం ఇవ్వకుండా
ఇచ్చినట్లు చూపుతున్నారు!
తొట్టంబేడు మండలంలో ని చియ్యవరం గ్రామాని కి చెందిన నా కుమారు డు ఏకాంబరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అయితే తాజా గా నేను ఇంటి పట్టా కోసం పీఎంఏవై కింద దరఖాస్తు చేసుకున్నాను. అయితే మా కోడలు హేమలత పేరుతో ఇంటిపట్టా ఇచ్చినట్లు అన్‌లైన్‌లో చూపుతుందని, దాని రద్దు చేస్తే కొత్త పట్టా దరఖాస్తును స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. స్థానిక అధికారులకు మొరపెట్టుకున్న వారు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చాను. – చెంగయ్య, చియ్యవరం గ్రామం
మా స్థలాన్ని ఆక్రమించి.. దౌర్జన్యం చేస్తున్నారు!


