కాలువలో పడి వ్యవసాయ కూలీ మృతి
నాయుడుపేట టౌన్: మండలంలోని పండ్లూరు సమీపంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి వెంగమాంబపురం గ్రామానికి చెందిన మర్రి గురుప్రసాద్(45) మృతి చెందాడు. పోలీసులు కథనం మేరకు.. వెంగమాంబపురం గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఆదివారం ఇంటి నుంచి పండ్లూరు సమీపంలో ఉన్న పొలాల వద్దకు కూలి పనుల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం పండ్లూరు గ్రామ సమీపంలోని చెరువు తూము వద్ద కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు జారీ అందులో పడిపోయాడు. అయితే అతను సోమవారం ఉదయం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి పండ్లూరు గ్రామ సమీపంలో మృతదేహం పడి ఉంటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాబి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.


