వేడుకగా అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం
నాయుడుపేటటౌన్: పట్టణంలో సోమవారం రాత్రి అయ్యప్పస్వామి అఖండ కర్పూర జ్యోతి పూజోత్స వం వేడుకగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీపార్కు సమీపంలో జరిగిన 44వ అఖండ జ్యోతి పూ జోత్సవానికి వందలాది మంది భక్తులు తరలివచ్చా రు. అయ్యప్పస్వామిని దర్శించుకుని తన్మయం చెందారు. అయ్యప్పస్వామి అఖండ జ్యోతి పూజోత్సవంలో ఉదయం నుంచే వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అ నంతరం కలశాన్ని ఊరేగించారు. కోటకొండ గజేంద్రస్వామితోపాటు గురుస్వాములు ఒక్కొక్క మెట్టు కు పూజలు చేస్తూ స్వామివారిని స్తుతిస్తూ 18 మెట్ల పై కర్పూర జ్యోతులను వెలిగించారు. అనంతరం దాదాపు వెయ్యి కిలోలపైగా తారక ప్రభు భక్త బృంద గురుస్వాములు సేకరించిన కర్పూరాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రాంగణం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్లు జలదంకి వెంటకకృష్ణారెడ్డి, షేక్ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి అఖండ కర్పూర జ్యోతి వెలిగించారు. భక్తులు అయ్యప్ప నామస్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. వివిధ అమ్మవార్ల వేషధారణలతో నృత్యాలు, కేరళ పంచవాయిద్యాలు, తప్పిట్ల నడుమ మహిళలు దీపాలు చేతపట్టి అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తికి స్వాగతం పలుకుతూ పట్టణ పురవీధుల్లో నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, భగవాన్ అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి, జలదంకి వెంకట కృష్ణారెడ్డి, కనమర్లపూడి సుబ్రమణి, చదలవాడ కుమార్, పాపాడి చంద్రారెడ్డి, గంధవళ్లి సిద్ధయ్య, చిరువేళ్ల మునిరాజ, కోటకొండ ప్రతాప్, నరేంద్ర పాల్గొన్నారు.
వేడుకగా అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం
వేడుకగా అఖండ కర్పూర జ్యోతి పూజోత్సవం


