తీరంలో ముసురు..చలిగాలులు | - | Sakshi
Sakshi News home page

తీరంలో ముసురు..చలిగాలులు

Dec 2 2025 7:52 AM | Updated on Dec 2 2025 7:52 AM

తీరంల

తీరంలో ముసురు..చలిగాలులు

● రూ.20 కోట్ల ఉపాధి బకాయిలు ● ఉపాధి నిబంధనలకు తూట్లు ● బోగస్‌ జాబ్‌ కార్డులు ● 13 వారాల బిల్లులు పెండింగ్‌

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

తిరుపతి జిల్లాలోని సముద్రతీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు ముసురు, చలిగాలులతో ఇబ్బందులు పడ్డారు.

మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

రెక్కాడితే కానీ డొక్క నిండని పేదలు వారు. కాయకష్టం చేస్తే వచ్చే కూలితోనే ఒక పూట తిని, మరో పూట పస్తులుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారు వలసల నివారణే లక్ష్యంగా కేంద్రం అమలు చేసిన ఉపాధి హామీ పథకం కింద మూడు నెలలుగా పనిచేస్తున్నారు. అయినా వారికి ఇంతవరకు కూలి డబ్బులు రాక నరకం అనుభవిస్తున్నారు. కుటుంబ పోషణకు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇదీ ఉపాధి కూలీల ధైన్యం.

నాగలాపురం మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

తిరుపతి అర్బన్‌: సంపద సృష్టిస్తా.. అభివృద్ధిబాటలో నడిస్తా అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న చంద్రబాబు పాలనలో కనీసం కూలి పనులు చేసుకుంటున్న పేదలకు కూలి డబ్బులను సకాలంలో ఇప్పించలేకపోతున్నారు. రాష్ట్రంలో నిధులు లేవంటూ పూర్తిగా కేంద్రానికి చెందిన జాతీయ ఉపాధిహామీ పథకంపైనే ఆధారపడి నెట్టుకొస్తున్నారు. సాధారణంగా జాబ్‌కార్డులున్న ఉపాధి కూలీలు ఒక వారంలో చేసిన పనికి వారం చివరిలో కొలతలు తీస్తారు.. మరుసటి వారంలో కూలి నగదును వారి పోస్టాఫీసు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఇది పథకం నిబంధన. అయితే అలా జరగడం లేదు. గత ఆగస్టు 15 నుంచి నవంబర్‌ 28 వరకు 2.90 లక్షల మందికి కూలీలకు రూ.20 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ముందే జాబ్‌కార్డుల్లో పెద్ద ఎత్తున బోగస్‌ కార్డులను చంద్రబాబు పాలనలో సృష్టించినట్లు చర్చసాగుతుంది. వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆ సమస్యలు చాలవంటూ చేసిన పనికి కూలి డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్రమైన వ్యతిరేకత చోటుచేసుకుంటుంది. కూలి డబ్బుల కోసం పలువురు కూలీలు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఏ పనికి వెళ్లినా సాయంత్రం డబ్బులు ఇస్తారు

వ్యవసాయ పనులు లే దా పరిశ్రమల్లో పనులు లేదా భవన నిర్మాణ ప నులకు వెళితే సాయంత్రం కూలి డబ్బులు ఇ స్తుంటారు. అయితే జా బ్‌కార్డులను చేతపట్టుకుని ఉపాధి కూలి పనికి వెళితే మూడు నెలలుగా కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. –సునీత, ఉపాధి కూలీ, నాగలాపురం

మా కూలి డబ్బులు మాకు ఇవ్వండి సార్‌

రెక్కాడితేకానీ డొక్కనిండని బతుకులు మావి. మేము ఎంతో కష్టపడి పనిచేస్తే మాకు ఇవ్వాల్సిన డబ్బులను 100 రోజులు గడుస్తున్న ఇ వ్వకపోవడం ఎంత వరకు న్యాయం. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. –కబాలి, ఉపాధి కూలీ,

నాగలాపురం మండలం

13 వారాల డబ్బులు పెండింగ్‌

13 వారాలకు చెందిన కూలి డబ్బులను పెండింగ్‌ పెట్టేశా రు. దీంతో కూలి డబ్బుల కో సం ఎదురుచూస్తున్నాం. కొ ద్ది రోజులుగా ఉపాధి కూ లి కి వెళ్లకుండా వ్యవసాయ ప నులకు వెళుతున్నాం. వారు సాయంత్రం ఇచ్చే డ బ్బులతో ఇంట్లో సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు కూలీలపై కాస్తా ప్రేమ చూపాలని కోరుతున్నాం. లేదంటే రానున్న రోజుల్లో ఉపాధి పనులకు ఎవరూ వెళ్లలేరు.

–అమరావతి, తిరువట్యం, నాగలాపురం మండలం

ఇల్లు గడవడం లేదు

ఇల్లు గడవడం లేదు. పొ దుపు డబ్బులు కట్టుకోవాలన్నా, ఇంటికి అవసరం అయిన సరుకులు తెచ్చుకోవాలన్న అప్పులు చే యాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా ఎప్పుడు జరగలేదు. ప్రతి వారం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆలస్యం అయితే రెండోవారం లేదా మూడోవారం ఇచ్చేవారు. అయితే 13 వా రాలు గడుస్తోంది. అయినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. –జ్యోతి, ఇప్పన్‌తాంగళ్‌,

నారాయణవనం మండలం, ఉపాధి కూలీ

ఇంత ఆలస్యం ఎప్పుడూ లేదు

ఏళ్ల తరబడి ఉపాధి కూ లి పనులు చేస్తున్నాం. అ యితే ఇంత ఆలస్యం ఎప్పుడు లేదు. ఒక వా రం పని చేస్తే రెండో వా రంలో బిల్లుల కోసం కూ లీలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే మూడు నెలలు పూర్తి అయినా ఇవ్వకపోవడం ఏ మాత్రం న్యాయం కాదని భావిస్తున్నాం. ఉన్నతాధికారులతో మాట్లాడి కూలీలకు న్యాయం చేయాల్సి ఉంది. –ఎస్‌కే రసూల్‌, ఉపాధి కూలీ

చీపినాపి గ్రామం

ఆగస్ట్‌ 15 నుంచి రావాలి

ఉపాధి కూలీలకు ఆగస్ట్‌ 15 నుంచి కూలీ డబ్బులు రావాల్సి ఉంది. మేము ఎదురుచూస్తున్నాం. త్వరలోనే వారి ఖాతాల్లో జమ చేస్తారు. మాకు చాలమంది కూలీలు ఫోన్లు చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. తప్పకుండా వీలైనంత త్వరలోనే మీ ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని భావిస్తున్నాం.

–శ్రీనివాస ప్రసాద్‌, డ్వామా పీడీ

ఎప్పుడు ఇస్తారో ఇస్తారో కూడా చెప్పలేదు

కూలి డబ్బులు ఎప్పుడు ఇస్తారో కనీసం స్పష్టంగా ఎవరూ చెప్పడం లేదు. కూలి డబ్బులు ఇవ్వడం జాప్యం చేయ డం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. జిల్లాలోనే లక్షల మంది కూలీలు డబ్బుల కోసం వేచి ఉన్నారు. ఇలా ఎప్పుడు జరగలేదు. అధికారులు జోక్యం చేసుకుని కూలీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

–చెనూరు శ్రీనయ్య,జంగాపల్లి, ఉపాధి కూలీ, వెంకటగిరి మండలం,

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 68,187 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,027 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

మల్లిమడుగు గేట్లు ఎత్తివేత

శ్రీవారి దర్శనానికి 10 గంటలు

తీరంలో ముసురు..చలిగాలులు 
1
1/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
2
2/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
3
3/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
4
4/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
5
5/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
6
6/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
7
7/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
8
8/9

తీరంలో ముసురు..చలిగాలులు

తీరంలో ముసురు..చలిగాలులు 
9
9/9

తీరంలో ముసురు..చలిగాలులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement